రామ్ చరణ్ రిపబ్లిక్ డే విషెస్…

428
ram charan
- Advertisement -

సుకుమార్ తీసిన మాస్ సినిమా రంగస్థలం పై రోజురోజుకి ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. మార్చి 30న‌ ఈ మూవీ విడుద‌ల కానుండ‌గా, రీసెంట్‌గా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. చెవిటి వ్య‌క్తిగా చిట్టిబాబు పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ అద‌ర‌గొట్టాడు. టీజర్ కొద్ది గంటల్లోనే కోటి వ్యూస్‌ను రాబట్టి.. బన్నీ స్థానాన్ని వెనక్కి నెట్టి బాహుబలి తర్వాతి స్థానంలో నిలిచింది.

Ranagasthalam

ప‌ల్లెటూరి నేప‌థ్యంలో అంద‌మైన ప్రేమ క‌థా చిత్రంగా ఈ మూవీ తెర‌కెక్కిన‌ట్టు తెలుస్తుంది. అన‌సూయ ఈ మూవీలో రంగ‌మ్మ‌త్త‌గా క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. అయితే రిపబ్లిక్ డే సందర్భంగా రంగస్థలం 1985 చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ కోడిపుంజును ఎత్తుకుని సెల్యూట్ చేస్తూ హ్యాపి రిపబ్లిక్ డే చెబుతున్నాడు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రంగస్థలం సినిమాలో హీరోయిన్ గా సమంత నటిస్తుండగా, జగపతిబాబు.. ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -