పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతిసనన్ జంటగా ఓం రౌత్ రామాయణ కథ ఆధారంగా తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ ఈ నెల 16న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. నిరుపేద పిల్లల కోసం రణబీర్ కపూర్ ‘ఆదిపురుష్’ 10,000 టిక్కెట్లను బుక్ చేయనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటన జారీ చేశారు.
అయితే, రణ్‌బీర్ కపూర్ బాటలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా అడుగులు వేయనున్నాడు. ‘ఆది పురుష్’ సినిమాకు తాను కూడా 10 వేల టికెట్లు బుక్ చేస్తున్నట్లు రామ్‌చరణ్ ప్రకటించాడు. ఈ టికెట్లను ఆంధ్రప్రదేశ్‌లోని చిన్నారులకు, వృద్ధాశ్రమంలో ఉండే వారికి పంచనున్నట్లు వెల్లడించాడు. మరి రణ్‌బీర్ కపూర్, రామ్ చరణ్ లాగే ఇంకా ఎంతమంది స్టార్ హీరోలు ‘ఆది పురుష్’ మూవీ టికెట్లను పేద పిల్లలకు పంచుతారో చూడాలి.
Also Read:ఎక్స్ పోజింగ్ ఏమిటి ? ఏమైనా చేస్తానంటుంది
ఓ పక్క స్టార్ హీరోలు ఆది పురుష్ సినిమాని ప్రమోట్ చేస్తుంటే.. మరోపక్క ‘ఆదిపురుష్’సరికొత్త పోస్టర్‌పై ఇంటింటి గృహలక్ష్మీ ఫేమ్, సీనియర్ హీరోయిన్ కస్తూరి విమర్శల వర్షం కురిపించారు. ‘ఆదిపురుష్’లో ప్రభాస్ రాముడిగా కాకుండా కర్ణుడిగా కనిపిస్తున్నారు అని ఆమె విమర్శించారు. శ్రీరాముడు, ఆయన సోదరుడు లక్ష్మణుడిని మీసాలతో చూపించడం ఏమిటని ప్రశ్నించారు. నటి కామెంట్స్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.