‘ఆచార్య’ నుండి ‘సిద్ధ’ టీజర్ అదిరింది..

56
Ram Charan

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘ఆచార్య’. చిరు 152 చిత్రంగా విశేషాన్ని సంతరించుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు మేకర్స్. ఇక ఇందులో రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే పవర్ ఫుల్ కేరక్టర్ చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ పాత్రకు సంబంధించిన టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ధ‌ర్మ‌స్థ‌లికి ఆప‌దొస్తే..అది జయించ‌డానికి ఆ అమ్మోరు త‌ల్లే మాలో ఆవ‌హించి మ‌మ్మ‌ల్ని ముందుకు పంపుతుంది..అంటూ సిద్ధ రోల్‌లో రాంచ‌ర‌ణ్ చెప్తున్న సంభాష‌ణలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అడవిలో రాంచ‌ర‌ణ్ చేసిన యాక్ష‌న్ స‌న్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. టీజ‌ర్ చివ‌ర‌లో సెల‌యేరుకు అవ‌త‌లివైపు చిరుత ఠీవిగా న‌డుచుకుంటూ వెళ్తున్న‌..ఇవ‌త‌లివైపు చిరు, చ‌ర‌ణ్ దాన్ని సీరియ‌స్‌గా చూస్తున్నారు. ఈ టీజ‌ర్‌తో సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు మేకర్స్

Acharya​ - Siddha's Saga Teaser | Megastar Chiranjeevi​​, Megapowerstar Ram Charan | Koratala Siva