రియల్ మెగాస్టార్ ను చూశానుః రామ్ చరణ్

390
Chiranjeevi Ram Charan
- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. సురెందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది. బాలీవుడ్ మెగాస్టారర్ అమితాబ్ బచ్చన్ ఈమూవీలో కీలక పాత్ర పోషించారు.

ఇక రామ్ చరణ్ తాజాగా ఈమూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో రామ్ చరణ్ చిరంజివి గడ్డం పట్టుకుని కనిపించాడు. ‘సైరా’ కోసం తన తండ్రి మారిన తీరు ఓ చక్కని అనుభవం అని, ఆయనకు నిర్మాతగా మారిన తర్వాతే ‘రియల్ మెగాస్టార్’ను తాను కలిశానని తన పోస్ట్ లో పేర్కొన్నారు.

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈచిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు రామ్ చరణ్. చిరంజీవి 152వ సినిమా కావడంతో ఈమూవీపై భారీగా అంచనాలున్నాయి. ఈమూవీని అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

- Advertisement -