ఘనంగా హీరో కార్తికేయ ఎంగేజ్‌మెంట్..

84
Karthikeya

ఆర్‌ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో కార్తీకేయ. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంటరైన కార్తీకేయ…వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇక తాజాగా ఈ హీరో సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.

తన కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఇది లవ్ ఆమ్యారేజ్ కాదు అరేంజ్డ్ వెడ్డింగ్. పెళ్ళికి సంబంధించిన తేదీ ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. కార్తికేయ తన నిశ్చితార్థానికి సంబంధించిన విషయాన్ని, పెళ్లి వేడుకను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

ప్రస్తుతం కార్తీకేయ…రాజా విక్రమార్క సినిమాలో నటిస్తుండగా త్వరలో విడుదల కానుంది. తర్వాత యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నటించనున్నారు కార్తికేయ.