ఆచార్య…చెర్రీతో రష్మికా రొమాన్స్..!

592
rashmika ram charan
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తుండగా చెర్రీకి జతగా రష్మికాను తీసుకోవాలని చిత్రయూనిట్ భావిస్తోందట. ఇందుకోసం రష్మికాతో సంప్రదింపులు జరుపుతోంది చిత్రయూనిట్. మెగాస్టార్ నటిస్తున్న సినిమా కావడంతో రష్మికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో ఈ మూవీ కథ సిద్ధం చేసిన కొరటాల శివ.. మెగా అభిమానులు మెచ్చేలా ఆ కథకు తెర రూపం ఇవబోతున్నారట. ఇక ప్రస్తుతం రామ్ చరణ్…రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ సినిమాలో బిజీగా ఉండగా ఈ మూవీ షూటింగ్ పూర్తవగానే ఆచార్య యూనిట్‌తో జాయిన్‌ కానున్నారు.

- Advertisement -