యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెళ్లి రోజు సందర్భంగా హీరో రామ్ చరణ్ దంపతులు ఇటీవల ఆయన నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో పాల్గొని సందడి చేశారు చరణ్ దంపతులు. తాజాగా, హీరో రామ్ చరణ్ ఫొటోను జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ ఒకే ఫ్రెమ్‌లో కనిపిస్తున్న ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట సెన్సేషన్‌గా మారింది.
ఈ పిక్‌లో రామ్ చరణ్.. సీనియర్ ఎన్టీఆర్ ఫొటో క్రింద కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు. దీంతో ఈ పిక్‌ని చూసి మెగా, నందమూరి అభిమానులు తెగ సంబరపడుతున్నారు. ఈ ఫొటోను ఎన్టీఆర్ స్వయంగా తన ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకోవడం విశేషం.
కాగా, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఓ మల్టీ స్టారర్ మూవీకి సంతకం చేసిన విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అరవింద సమేతా..’ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండగా.. బోయపాటి మూవీలో చరణ్ నటిస్తున్నాడు.
Provoked by LEGENDARY thoughts pic.twitter.com/GvUj6XC4Ra
— Jr NTR (@tarak9999) June 8, 2018