గోవాలో రామ్ చరణ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

390
upasana-ramcharan
- Advertisement -

దేశ వ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సరాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈసందర్భంగా పలువురు సెలబ్రెటీలు కూడా ఫ్యామిలీతో కలిసి టూర్ లకు వెళ్లారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసనతో కలిసి గోవాకి వెళ్లారు. రామ్ చరణ్‌ దంపతులు గోవాలో న్యూఇయర్ వేడుకలు జరుపుకున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి చిన్న బ్రేక్ ఇచ్చి ఉపాస‌న‌తో క‌లిసి గోవాకి వెళ్లారు.

జ‌న‌వ‌రి 3న ఆయన తిరిగి హైద‌రాబాద్‌కి రానున్నారు. వెంటనే ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ లో బిజీ కానున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నాడు రామ్ చరణ్‌. రాజమౌళి దర్శకత్వంల వహిస్తోన్న ఈమూవీని జులైలో విడుదల చేయనున్నారు. మరోవైపు ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ హరీశ్ శంకర్ లేదా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

- Advertisement -