పెద్ది షూటింగ్‌లో రామ్ చరణ్‌కు గాయం!

5
- Advertisement -

టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్‌కు ‘Peddi’ సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయం అయినట్లు సమాచారం. షూటింగ్ సమయంలో జరిగిన చిన్న ప్రమాదంలో ఆయన కంటి దగ్గర గాయమైనట్లు సినీ వర్గాలు తెలిపాయి.

అయితే ఈ గాయం తీవ్రంగా లేదని, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే పూర్తిగా కోలుకుంటారని డాక్టర్లు సూచించినట్లు సమాచారం. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా సినీ వర్గాలు స్పష్టం చేశాయి.

ఈ ఘటన నేపథ్యంలో ‘పెద్ది’ సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు. రామ్ చరణ్ పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభించే అవకాశముంది. ఇక రామ్ చరణ్ త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొనాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Also Read:KTR:డీలిమిటేషన్‌ను స్వాగతిస్తున్నాం..కానీ!

- Advertisement -