మరోసారి రామ్ చరణ్ కు గాయాలు..స్పందించిన టీం

373
ram charan
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ తేజ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈమూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ లో భాగంగా యాక్షన్ సన్నివేశాలు చిత్రకరిస్తుండగా…చెర్రీ కాలుకి గాయం అయిన సంగతి తెలిసిందే.

అయితే కొద్ది రోజుల విరామం తర్వాత తిరిగి షూటింగ్ లో పాల్గోన్నాడు చరణ్. అయితే తాజాగా మరోసారి చరణ్ కు గాయాలయ్యాంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై స్పందించారు రామ్ చరణ్ పీఆర్ఓ వంశీ కాక. రామ్ చరణ్ గాయపడ్డారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో హుషారుగా పాల్గొంటున్నారని వంశీ కాక తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుందన్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈమూవీని డివివి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

- Advertisement -