చెన్నైలో రామ్ చరణ్.. ‘గేమ్ ఛేంజర్’

21
- Advertisement -

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్‌లో ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ భారీ బ‌డ్జెట్‌తో అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన జరగండి సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తిరుణ్ణావుకరుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు,తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈ సినిమా తాజా షెడ్యూల్ మే 1 నుంచి చెన్నైలో జరగనుందట. శంషాబాద్‌ షెడ్యూల్‌లో రామ్ చరణ్, సునీల్, నవీన్ చంద్ర కాంబోలో పలు సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. రామ్ చరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ లుక్‌లో కనిపించబోతున్నాడు.

Also Read:డయాబెటిస్ ఉన్నవాళ్ళు వీటిని తింటే డేంజర్!

- Advertisement -