గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, తన తొలి చిత్రం సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘ఉప్పెన’తో జాతీయ అవార్డును గెలుచుకున్న యంగ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానతో చేతులు కలిపారు. ఈ సెన్సేషనల్ కాంబినేషన్‌లో వచ్చే క్రేజీ సినిమా టెక్నికల్ స్టాండర్డ్స్ పరంగా అత్యున్నతంగా ఉండబోతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై అత్యంత భారీ బడ్జెట్, అత్యంత భారీ స్థాయిలో వెంకట సతీష్ కిలారు నిర్మించనున్నారు.
బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే… ఈ మెగా వెంచర్ కోసం, ఆస్కార్-విన్నింగ్ కంపోజర్ ఎఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. బుచ్చిబాబు ఉప్పెన మ్యూజికల్ హిట్, రెండవ చిత్రం కూడా మ్యూజికల్ చార్ట్‌బస్టర్ కాబోతుంది.
ఏఆర్ రెహమాన్ భారతీయ సినిమా చరిత్రలో అత్యంత విజయవంతమైన సంగీత దర్శకుల్లో ఒకరు. దేశవ్యాప్తంగా సంగీత ప్రియులలో మ్యాసీవ్ ఫాలోయింగ్ ఆయన సొంతం. ఆస్కార్ అవార్డును గెలుచుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమయ్యారు. రెహమాన్ సంగీతం విశ్వవ్యాప్తం. రెహమన్ సంగీతం ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ప్రధాన ఆకర్షణగా ప్రేక్షకులని అలరించబోతుంది.
బుచ్చిబాబు యూనివర్సల్ అప్పీల్ ఉండే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తారు మేకర్స్.
Also Read:WHO సలహాదారుగా ఖమ్మం వాసి