మాస్,కమర్షియల్ చిత్రాలకు పెట్టింది పేరు బోయపాటి శ్రీనివాస్. యాక్షన్ సీన్స్ తాను తప్ప మరెవరు చేయలేరనే విధంగా ప్రేక్షకులను మెప్పించిన బోయపాటి..మెగా పవర్ స్టార్ రాంచరణ్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చెర్రీ సరసన భరత్ అనే నేను ఫేమ్ కైరా అద్వాని హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ హీరో వివేక్ ఒబరాయ్ విలన్‌గా నటిస్తున్నాడు.
నవంబర్ 6న మధ్యాహ్నం ఒంటి గంటలకు ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. నవంబర్ 9న ఉదయం 10.25 గంటలకు టీజర్ విడుదల కానున్నట్లు ప్రకటించారు చిత్ర నిర్మాతలు.
ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తికాగా ఇటీవలె రామోజీ ఫీలింసిటీలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చెర్రీ-బొయపాటి మార్క్ ఉండేలా తెరకెక్కిస్తున్న ఈ సీన్స్ సినిమాలో హైలైట్‌గా నిలవనున్నాయట. ఫైట్ మాస్టర్ కమల్ కన్నన్ నేతృత్వంలో తెరకెక్కుతుండగా చరణ్, ఆర్యన్ రాజేష్, ముఖేష్ రుషి తదితరులు పాల్గొన్నారు.
రాంచరణ్ సరికొత్త కోణంలో కనిపించనుండగా మాస్‌తో పాటు కుటుంబ కథా చిత్రాలను ఇష్టపడే వారికి నచ్చుతుందని చిత్రయూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 2019 సంక్రాంతికి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.