‘భజరంగీ భాయ్ జాన్, బాహుబలి’ వంటి భారీ సినిమాలకు కథలందించి, దేశవ్యాప్త గుర్తింపు సాధించిన రచయిత విజయేంద్రప్రసాద్ స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రం ‘శ్రీవల్లి’. సైన్టిఫిక్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని చాలా రోజులైంది. అయితే ఈ సినిమా ఎందుకు ఆలస్యమైందో విజయేంద్రప్రసాద్ అప్పట్లోనే క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న విడుదలచేయనున్నారు.
రాజమౌళి ముఖ్య అతిథిగా ఈ సినిమా ఆడియో వేడుక ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌ను ఈ నెల 10న నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో జరగనున్న ఈ ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా మెగా హీరో రామ్ చరణ్ తేజ్ రానున్నాడు.
ఈ చిత్రంలో ఎస్ఎస్ రాజమౌళి స్వయంగా వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. కథ, పాత్రలను పరిచయం చేస్తూ ఆయన మాటలు వినిపించనున్నాయి. ఈ సినిమా అంతా మనసులోని చెడు భావాలను తొలగించడం అనే ప్రయోగం నైపథ్యంలో సాగుతుంది. మనసుని చూడటం, కొలవడం అనే ప్రయోగం. ఈ ప్రయోగంలో పాల్గొన్న అమ్మాయికి తన గత జన్మల జ్ఞాపకాలు కూడా గుర్తొస్తాయి. ఆ జన్మకు, ప్రస్తుత జన్మకు మధ్య జరిగే ఘర్షణ ఎలా ఉంటుందనేది సినిమాలో చూడాల్సిందే.