మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన జంట కోసం సకల సౌకర్యాలతో కొత్త ఇల్లు నిర్మాణం జరుగుతోంది. ఈ విషయాన్ని మెగాపవర్ స్టార్ భార్య ఉపాసన స్వయంగా వెల్లడించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చరణ్‌తో విడాకుల దగ్గరి నుంచి అన్ని విమర్శలపై సమాధానం ఇచ్చిన ఉపాసన…త్వరలో కొత్త ఇంటికి షిఫ్ట్ కాబోతున్నట్లు వెల్లడించింది. ఇక ఈ ఇల్లు సకల హంగులతో నిర్మిస్తున్నారట. ఇంద్రభవనాన్ని తలపించే విధంగా ఆర్కిటెక్..సకల సౌకర్యాలతో చెర్రీ..ఉపాసన డ్రీమ్ హౌజ్ ఉండనుందట.
ఇక చెర్రీ డ్రీమ్ హౌజ్ రేటు వింటే మీరు షాకవ్వడం గ్యారెంటీ. దాదాపుగా 80 కోట్ల రూపాయలను ఈ ఇంటినిర్మాణం కోసం ఖర్చుచేస్తోందట ఈ జంట. వచ్చే ఏడాదిలో ఇంటి నిర్మాణం పూర్తవుతుందని తెలుస్తోంది. ఆ వెంటనే సొంతిట్లో ఈ జంట అడుగుపెట్టనుందట. ప్రస్తుతం రాంచరణ్ తో ఉపాసన అందరితో కలిసి ఉమ్మడిగా ఉంటోంది. దీంతో చరణ్ తో ఉపాసన ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయలేకపోతుందట.
కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన తరువాత కావాల్సినంత ఎక్కు సమయాన్ని రాంచరణ్ తో ఉండాలని ఉపాసన భావిస్తోంది. అంతేకాదు ప్రస్తుతం స్లిమ్ గా మారిన ఉపాసన కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన తరువాతే పిల్లలను కనే విషయంలో ఓ క్లారిటీకి రానుందట. రాంచరణ్, ఉపాసన ఒక అండర్ స్టాండిగ్ తోనే ఇప్పట్లో పిల్లలు వద్దని అనుకున్నారట. తమకు ఇంకా బోలెడు భవిష్యత్ ఉందని, మరిన్ని కొంతకాలం సరదాగా గడపాలని ఈ జంట భావిస్తోంది.