చరణ్ మాస్ యాంగిల్ ఎలా ఉంటుందో చూపించడానికి రామ్ చరణ్ సిద్ధమౌతున్నాడు. చిట్టిబాబుకు టాటా చెప్పేసి ఊర మాస్‌కు స్వాగతం చెప్పబోతున్నాడు. చరణ్ తాజా చిత్రంగా వచ్చిన ‘రంగస్థలం’ ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి చోటు నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. దాంతో ఈ సినిమా టీమ్ ఫుల్ ఖుషీగా వుంది. ఈ సినిమా తరువాత చరణ్ .. బోయపాటితో ఒక సినిమా చేయనున్నాడు. ఆల్రెడీ ఫస్టు షెడ్యూల్ ను బోయపాటి పూర్తి చేసేశాడు.
చరణ్ పాత్ర ప్రమేయం లేని సన్నివేశాలను ఆయన చిత్రీకరించాడు. అయితే ఇప్పుడు చరణ్ ఫ్రీ కావడంతో వచ్చేనెల 10వ తేదీ నుంచి రెండవ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో చరణ్ కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో తమిళ సీనియర్ హీరో ప్రశాంత్ .. స్నేహ .. ఆర్యన్ రాజేశ్ .. అనన్య ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాలో విలన్ గా వివేక్ ఒబెరాయ్ .. చరణ్ తో తలపడనుండటం విశేషం . ఈ సినిమాను దసరా కానుకగా అందించాలని దర్శక నిర్మాతలు చూస్తున్నారు.