మెగా అభిమాని మృతి..టీజర్ వాయిదా వేసిన బన్నీ

862
noor-bhaiii
- Advertisement -

మెగా ఫ్యామిలీ అభిమాని నూర్ భాయ్ ఈరోజు ఉదయం మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. నూర్ భాయ్ ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షులుగా ఉన్నారు. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న అల..వైకుంఠపురంలో సినిమా టీజర్ ను ఈరోజు విడుదల చేస్తామని ప్రకటించారు చిత్రయూనిట్. అయితే ఉదయం నూర్ భాయ్ చనిపోవడంతో అల..వైకుంఠపురంలో టీజర్ ను వాయిదా వేసినట్లు నిర్మాతలు తెలిపారు.

ఈ మేరకు గీతా ఆర్ట్స్ సంస్ధ వారు ట్వీట్టర్ ద్వారా తెలిపారు. నూర్ ఆక‌స్మిక మ‌ర‌ణంతో వాయిదా వేశారు. మా ఫ్యామిలీ వ్యక్తిలాంటి నూర్ చనిపోయిన టైంలో చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ ఇవ్వ‌డం క‌రెక్ట్ కాద‌నిపించింది. స‌రైన స‌మ‌యం చూసుకోని అల‌.. వైకుంఠ‌పుర‌ములో చిత్ర టీజ‌ర్ వివ‌రాలు వెల్ల‌డిస్తాం అని గీతా ఆర్ట్స్ త‌మ ట్విట్ట‌ర్‌లో పేర్కొంది.

మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నూర్ మృతిపై స్పందించారు. అభిమానులు మా కుటుంబం. మా ప్రియమైన కుటుంబ సభ్యుడు నూర్ మొహమ్మద్ జిని నిజంగా కోల్పోయాం. అతని స‌హాయ గుణం, ఎదుటి వారితో మెలిగే తీరు ఈ నాటి యువ తరానికి ఒక ప్రమాణంగా నిలిచింది.ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు.

- Advertisement -