సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం తేజ్ ఐ లవ్ యూ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. తేజ్ ఈ మధ్య తీసిని సినిమాలన్ని ఫెయిల్ అవ్వడంతో ఈసినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఈసినిమకు తేజ్ రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదని సమాచారం. ఈమూవీకి కరుణాకరణ్ దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు నిర్మించారు. తేజ్ సరసన హీరోయిన్ గా అనుపమా పరమేశ్వరన్ నటించింది.
ఇక ఇటివలే విడుదలైన ఈసినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. పుల్ లెన్త్ లవ్ స్టోరీగా ఈసినిమాను తెరకెక్కించారు. దర్శకుడు కరుణాకరణ్ కూడా ఈసినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఇటివలే ఈసినిమా ట్రైలర్ చూశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఈ ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు రామ్ చరణ్.
ఇటివలే తేజ్ ఐ లవ్ యూ సినిమా ట్రైలర్ చూశాను..నాకు బాగా నచ్చిందని చెప్పారు. ఈ మూవీలో విజువల్స్ , గ్రాఫిక్స్ మ్యూజిక్ నాకెంతో నచ్చాయని చెప్పారు. కరుణాకరణ్ నుంచి వస్తోన్న మరోక నమ్మకమైన సినిమాలా అనిపిస్తోందన్నారు. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోన్నారని తెలిపారు. ఇంత మంచి లవ్ స్టోరీ ని అందిస్తోన్న దర్శక నిర్మాతలకు అభినందనలు తెలిపారు. ఇక జులై 6వ తేదిన విడుదలవుతోన్న ఈసినిమా గ్రాండ్ సక్సెస్ సాధిస్తోందని కొరుకుంటున్నానని తెలిపారు. ఇక రామ్ చరణ్ చేసిన ట్వీట్ అనుపమా, సాయి ధరమ్ తేజ్ లు ధన్యవాదాలు తెలిపారు.
MegaPowerStar #RamCharan about #TejTrailer via FB @IamSaiDharamTej #TejILoveYouFromJuly6
Link : https://t.co/PFeyMkFIun pic.twitter.com/pQXyEhOTTx— Supreme Hero SDT Fans (@SaiDharamTej_FC) June 28, 2018