అమ్మ డ్రీమ్ నెరవేరింది: రామ్‌ చరణ్‌

197
ram charan

నాన్న,నేను కలిసి వెండితెరపై నటించాలన్నది అమ్మ చిరకాల కోరిక…ఆచార్య సినిమాతో ఆ కల నెరవేరిందన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అమ్మ కల సాకారం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చెర్రీ….ఆచార్యలో కీ రోల్ పోషిస్తున్నానని వెల్లడించారు. నాన్న పాపులారిటీ వల్లే తనకు ఇంత స్టార్ డమ్ వచ్చిందన్నారు. తాను నటించిన బ్రూస్ లీ సినిమాలో నాన్న గెస్ట్ రోల్‌లో నటించారు కానీ ఆచార్యలో తనది గెస్ట్ రోల్ కాదన్నారు.

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ చిరంజీవి 152వ సినిమా కాగా కొణిదెల ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు రాంచ‌‌ర‌ణ్ కో ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.