భీమ్లా నాయక్‌…ట్రైలర్ సూపర్బ్

178
ram charan
- Advertisement -

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో తెరకెక్కిన చిత్రం “భీమ్లా నాయక్”. ఇవాళ ప్రీ రిలీజ్ వేడుక జరగనుండగా ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక సినిమా ప్రమోషన్‌లో భాగంగా విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

ఇప్పటికే యూ ట్యూబ్‌ రికార్డులను భీమ్లా నాయక్ షేక్ చేస్తుండగా ట్రైలర్‌పై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌ తనదైన శైలీలో స్పందించారు. #భీమ్లానాయక్ ట్రైలర్ ఎలెక్ట్రిఫయింగ్… పవన్ కళ్యాణ్ గారి ప్రతి డైలాగ్ & యాక్షన్ “పవర్ ఫుల్”… నా మిత్రుడు రానా పర్ఫార్మెన్స్ అండ్ ప్రెజెన్స్ అద్భుతం అని ట్విట్టర్‌ వేదికగా కొనియాడారు. #BheemlaNayakonFeb25 #Trivikram @saagar_chandrak @MenenNithya @SitharaEnts @MusicThaman ఆల్ ది బెస్ట్ అని చెప్పారు.

- Advertisement -