- Advertisement -
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం RC15. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరగుతోండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అలాగే భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా తెరకెక్కిస్తున్నారు.
ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఔట్ అండ్ ఔట్ పొలిటికల్ డ్రామాగా సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో చరణ్ నటిస్తుండగా ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
చరణ్ సరసన అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాలో పలువరు మేటి స్టార్స్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -