విజయోత్సవ ర్యాలీలు నిషేధం…

257
elections 2018
- Advertisement -

తెలంగాణ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది.మొదటగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించనున్నారు. అరగం‍టపాటు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

మరోవైపు ఎన్నికల్లో విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించారు అధికారులు. ఈ మేరకు రాచకొండ, సైబరాబాద్‌ సీపీలు మహేశ్‌ భగవత్, వీసీ సజ్జనార్‌ కూడా ఉత్తర్వులిచ్చారు. బాణసంచా కాల్చడంపై కూడా నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. పోలీస్‌ శాఖ నుంచి అనుమతి తీసుకొని బుధవారం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకోవాలని సూచించారు.

రాజకీయ పార్టీలు, నేతలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించవద్దని వారు సూచించారు. ఎలక్షన్‌ ఏజెంట్లు, మీడియాకు సైతం ప్రత్యేక ప్రాంతాలు కేటాయించామని, ఎవరూ దగ్గరకు వెళ్లరాదని స్పష్టం చేశారు. కౌంటింగ్‌ ప్రక్రియ ఆద్యంతం వీడియో రికార్డింగ్‌ చేస్తున్నారు. గత ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 1649 కేసులు నమోదు కాగా ఈసారి ఆ సంఖ్య 1550 వరకు ఉందని చెప్పారు. పోలింగ్‌ రోజునే 41 కేసులు రిజిస్టర్‌ అయినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -