ముగిసిన ‘మా’ ఎన్నికల పోలింగ్..

115
- Advertisement -

టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి 3 గంటల వరకు పోలింగ్ జరిగింది. అయితే మధ్యాహ్నం 2 గంటల సమయానికి క్యూలో ఉన్నవారికి 3 గంటల వరకు ఓటేసేందుకు అనుమతించారు. 3 గంటల తర్వాత కూడా ఇంకా చాలా మంది క్యూలో ఉండడంతో.. వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. గతంలో ఎన్నడూలేనంతగా ఈ సారి 600కి పైగా ఓట్లు పోలయ్యాయని సమాచారం.

మాలో 883 ఓట్లు ఉండగా, పోస్టల్ బ్యాలెట్లతో కలిపి 665 మంది ‘మా’ సభ్యులు ఓటేశారు. పోలింగ్‌కు అదనపు సమయాన్ని కేటాయించడంతో మరికొన్ని ఓట్లు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఓటింగ్ శాతం పెరగడంతో మా సభ్యుల్లో ఆనందం కనిపిస్తోంది.ఈ సారి 70 శాతం పోలింగ్ నమోదయింది. బెంగళూరు, ముంబయి, చెన్నై నుంచి వచ్చి ఓటేశారు. కాగా, సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. రాత్రి 8 గంటలకు రిలీజ్ కానున్నాయి.

- Advertisement -