ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలతో దూసుకెలుతున్న హీరోయిన్ ఎవరంటూ ముందుగా వినిపించే పేరు రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్లో అతి తక్కువ వ్యవధిలో ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకోలుతోంది ఈ బ్యూటీ.
రెండుసార్లు మిస్ ఇండియా ఫైనల్స్‌కి వెళ్ళడమే కాకుండా నాలుగు సబ్ టైటిల్స్ గెల్చుకొని మోడలింగ్ ఫీల్డ్‌కి వెళ్ళి ఆ తర్వాత కన్నడలో ‘గిల్లి’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో హీరోయిన్‌గా మొదటిసారి నటించిన రకుల్ పేరు ప్రార్థన ‘ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ’ అన్న డైలాగ్‌తో అందర్నీ ఆకట్టుకుంది. అప్పటి నుండి స్టార్ హీరోల సరసన వరుస ఆఫర్లు అందుకుంటూ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా మారింది.
మెగా హీరోలు బన్నీ, చరణ్, సాయిధరమ్ తేజ్ లతో నటించిన రకుల్ లౌక్యం, కరెంటు తీగ, పండగ చేస్కో వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం రకుల్ చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇటీవల రామ్ చరణ్ తో కలిసి ధృవ అనే చిత్రాన్ని చేసిన రకుల్ సాయిధరమ్ తేజ్ క్రేజీ ప్రాజెక్ట్ విన్నర్, మహేష్- మురుగదాస్ భారీ బడ్జెట్ చిత్రం, బోయపాటి శ్రీను ప్రాజెక్ట్, కళ్యాణ్ కృష్ణ- నాగ చైతన్య ప్రాజెక్ట్ లలో కథానాయికగా నటించే ఆఫర్స్ అందుకుంది.
అయితే రకుల్ తెలుగులో నటించిన తొలి చిత్రం వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ నేటితో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ఈ అమ్మడు తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంది. ఈ మూడు సంవత్సరాల జర్నీ చాలా అందంగా ఉందని, నా పై ఇంత ప్రేమాభిమానులు కురిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ రకుల్ తెలిపింది.
3 years since #venkatadriexpress released ! This journey has been more than beautiful. love from all of u has been overwhelming.thankuu😘
— Rakul Singh (@Rakulpreet) November 29, 2016