సవ్యసాచిలో ఐటెంగా రకుల్..!

237
Rakul Preet Singh special song in Savyasachi
- Advertisement -

తెలుగులో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని వరుస అవకాశాలు దక్కించుకుంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తక్కువ టైంలోనే అందరు అగ్రహీరోలతో కలిసి నటించిన ఈ బ్యూటీ దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలని చూస్తోంది. ఓ వైపు సినిమాలే కాదు జిమ్‌ బిజినెస్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తాజాగా ఐటెం సాంగ్‌ చేయడానికి కూడా సిద్దమైంది.

నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో నాగార్జున ‘అల్లరి అల్లుడు’ సినిమాలోని ‘నిన్ను రోడ్డుమీద చూసినది లగాయిత్తు’ పాటను రీమిక్స్ చేయనున్నట్టుగా సమాచారం.

మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసిన ఈ సాంగ్‌ ప్రత్యేకంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారట. ఇందుకోసం సొట్టబుగ్గల సుందరి రకుల్‌ను సంప్రదిస్తున్నారట. ఎందుకంటే ఇప్పటికే కాజల్,తమన్నా,శ్రుతి హాసన్,రాశి ఖన్నా ఐటమ్ సాంగ్స్ చేసేసి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా రామ్ చరణ్ రంగస్ధలం సినిమాలో పూజా హెగ్డే సైతం స్పెషల్‌ సాంగ్‌లో ప్రేక్షకులను అలరించింది. దీంతో రకుల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా లగాయిత్తు సాంగ్‌ ఈ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని సమాచారం.

Rakul Preet Singh special song in Savyasachi మాధవన్, భూమికలు ప్రత్యేక పాత్రలు పోషిస్తుండగా.. జూన్‌ 14న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల విడుదల చేసిన చైతూ ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకుంది. సవ్యసాచి అంటే రెండు చేతులని సమర్ధవంతంగా,శక్తివంతంగా వాడే వాళ్లని అర్ధం. ఇక ఈ ఫస్ట్ లుక్‌లో చైతూ సీరియస్‌ లుక్‌లో కనిపిస్తుండగా పది చేతులతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఫస్ట్ లుక్‌తోనే సినిమా ఎలా ఉండబోతుందో సంకేతాలను ఇచ్చేశారు. బాహుబలి ఫేం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -