రకుల్‌.. కొత్త లవ్‌ !

240
rakul new experience
- Advertisement -

ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలతో దూసుకెలుతున్న హీరోయిన్ ఎవరంటూ ముందుగా వినిపించే పేరు రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్లో అతి తక్కువ వ్యవధిలో ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతోంది ఈ బ్యూటీ. టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌ల లిస్ట్‌లో చేరిపోయింది రకుల్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని సామెతను ఒంట బట్టించుకున్న రకుల్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది రకుల్. అంతేకాదు జిమ్‌ బిజినెస్‌ను కూడా స్టార్ట్‌ చేసింది. ఈ బిజినెస్‌ మూడు పూవులు, ఆరు కాయలుగా నడుస్తోంది. అటు సినిమాలతో.. ఇటు బిజినెస్‌లతో బాగానే సంపాదించేస్తున్న రకుల్‌.. తన గ్యారేజ్‌లో మరో కొత్తకారును చేర్చింది. తాజాగా రకుల్‌ మెర్సిడెస్‌ బెంజ్‌ కారును కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ.. ‘నా కొత్త లవ్‌’ అనే క్యాప్షన్‌తో ఫొటో షేర్‌ చేసింది. రకుల్‌ ప్రస్తుతం ఆడీ క్యూ4 కారును వాడుతోంది.

rakul

తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంలో హీరోయిన్‌గా మొదటిసారి నటించిన రకుల్‌ పేరు ప్రార్థన ‘ప్రతి రూపాయి కౌంట్‌ ఇక్కడ’ అన్న డైలాగ్‌తో అందర్నీ ఆకట్టుకుంది. అప్పటి నుండి స్టార్ హీరోల సరసన వరుస ఆఫర్లు అందుకుంటూ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా మారింది. ప్రస్తుతం రకుల్‌ హిందీలో ‘అయారీ’, తమిళంలో ‘థీరన్‌ అధిగరం ఒండ్రు’ చిత్రాల్లో నటిస్తోంది. ఆమె మహేశ్‌కు జోడీగా నటించిన ‘స్పైడర్‌’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -