నాగార్జునకు భార్యగా టాలీవుడ్ టాప్ హీరోయిన్

273
nagarjuna Rakul
- Advertisement -

అక్కినేని నాగార్జున ప్రస్తుతం మన్మధుడు2మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈచిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటివలే ఈచిత్ర షూటింగ్ ప్రారంభయింది. సొంత బ్యానర్ లో నాగార్జున ఈమూవీని నిర్మిస్తున్నారు. ఈచిత్రం షూటింగ్ ఎక్కువ శాతం విదేశాలలోనే చిత్రికరించనున్నారు. అయితే ఈమూవీలో నాగార్జున సరసన హీరోయిన్ గా నటించేందుకు ఓ యంగ్ హీరోయిన్ ఒప్పుకున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.

కెరీర్ ప్రారంభంలో వరుస విజయాలతొ దూసుకుపోయిన రకుల్ ప్రిత్ సింగ్ ఈమధ్య కాలంలో ఆమె నటించిన సినిమాలు అన్ని పరాజయాలయ్యాయి. దీంతో ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. 2016లో ధృవ సినిమాతో చివరగా బిగ్‌ హిట్ అందుకున్న రకుల్‌ తరువాత టాలీవుడ్ లో ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం నాగార్జున మన్మధుడు2 మూవీలో రకుల్ ప్రిత్ సింగ్ నటించనున్నట్లు సమాచారం.చాలా మంది యంగ్ హీరోయిన్లను సంప్రదించినా ఎవరూ ఈపాత్ర చేయడానికి ముందుకు రాలేదట.

కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం అడగ్గానే ఒప్పేసుకుందని సమాచారం. రకుల్ కు తెలుగులో విజయాలు లేకపోవడంతో కొద్ది రోజులు తమిళ్ , కన్నడ, హిందీ భాషల్లో నటించింది. అక్కడ కూడా సరైన హిట్లు లేకపోవడంతో అవకాశాలు పెద్దగా రావడం లేదు. దీంతో ఇప్పుడు అమ్మడు మొత్తం తెలుగు సినిమాలపై మాత్రమే దృష్టి పెట్టింది. త్వరలోనే రకుల్ ఈమూవీ షూటింగ్ లో పాల్గోననుందని సమాచారం. ఈసినిమాతోనైనా రకుల్ కు హిట్ వస్తుందో లేదో చూడాలి మరి.

- Advertisement -