ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలతో దూసుకెలుతున్న హీరోయిన్ ఎవరంటూ ముందుగా వినిపించే పేరు రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్లో అతి తక్కువ వ్యవధిలో ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకోలుతోంది ఈ బ్యూటీ. రకుల్ దక్కించుకుంటున్న సినిమాలన్నీ దాదాపు టాలీవుడ స్టార్ హీరోలవే కావడం విశేషం. ఈ అమ్మడు తాజాగా నటించిన చిత్రం జయ జానకి నాయకా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకుంది.
అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తి కర విషయాలను వెల్లడించింది రకుల్ ప్రీత్ సింగ్. నీకు కాబోయే భర్త ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు రకుల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచి వాడు భర్తగా రావాలని తాను కోరుకోవడం లేదని… ఎందుకంటే అసలు అబ్బాయిల్లో మంచి వాళ్లు ఉండరని ఈ భామ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇందులో సందేహం ఏమీ లేదని స్పష్టం చేసింది. ‘
అబ్బాయిల్లో మంచి వాళ్లు అంటూ అస్సలు ఉండరు. ఒకవేళ ఉన్నారంటే.. అది నటించడం మాత్రమే. అమ్మాయిల ముందు మంచోళ్లుగా నటిస్తారు. ఎదురుగా లేనప్పుడు ఎలాంటి వేషాలు వేస్తారో ఎవరికీ తెలీదు.. అందుకే అబ్బాయిల్లో మంచి వాళ్లు ఉంటారంటే తాను నమ్మనని, కాబట్టి.. నాకు మంచి వాడు భర్తగా రావాలని నేను అనుకోవడం లేదని రకుల్ తేల్చి చెప్పింది.
అయితే తనకు కాబోయే భర్త మాత్రం పొడగరి అయి ఉండాలని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. తనకు కాబోయే భర్తకు ఏం ఉన్నా ఏం లేకపోయినా అతను హైట్ గా ఉండాలని పేర్కొంది. అలాంటి వాడినే చేసుకుంటానని స్పష్టం చేసింది.