టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్యన క్యాస్టింగ్ కౌచ్ అంశంపై రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. అసలు ఇండస్ట్రీలో అలాంటి సంస్కృతిని తాను చూడలేదని.. ఫేస్ చేయలేదని చెప్పింది రకుల్. ఆమె కామెంట్స్ పై కొందరు తీవ్రంగానే విరుచుకుపడ్డారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ సాక్ష్యాధారాలు బైటపెడతానని ఇటీవల శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే సినిమాల్లో అవకాశాల కోసం కొందరు ఏమైనా చేస్తారేమో, కానీ తాను మాత్రం అలా చేయనని సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. కాస్టింగ్ కౌచ్ పై నిరసన గళం విప్పిన శ్రీరెడ్డిపై మండిపడిన రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, అమ్మాయి పిలవగానే చెప్పిన చోటుకు వస్తుందని, చెప్పినట్టు చేస్తుందని భావించి, ఆమెపై వందకోట్లు పెట్టుబడి పెట్టి ఎవరూ సినిమా తీయరని రకుల్ ప్రీత్ తెలిపింది. కాస్టింగ్ కౌచ్ పై సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోందని తెలిపింది.
తాను కేవలం తన గురించి మాత్రమే మాట్లాడగలనని చెప్పింది. తనకింత వరకూ అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని రకుల్ స్పష్టం చేసింది. సినీ పరిశ్రమలో ప్రతిభే అంతిమంగా నిలబెడుతుందని రకుల్ ప్రీత్ తెలిపింది. పరిశ్రమలోకి కొత్తగా వచ్చే అమ్మాయిలకు తాను చెప్పేదేంటంటే.. ‘అవకాశాల పేరుతో అడ్వాంటేజ్ తీసుకునేందుకు చాలా మంది ఎదురు చూస్తుంటారు.. వారు కోరుకున్నది ఇవ్వాలా? వద్దా? అన్నది నిర్ణయించుకోవాల్సింది మహిళలే’నని ఆమె స్పష్టం చేసింది. సరైన అవకాశం రావడానికి సమయం పడుతుందని, ఓపిగ్గా ఎదురు చూడాలని సూచించింది. అయితే వర్క్ ప్లేస్ విషయంలో టాలీవుడ్ అత్యంత భద్రమైన ప్లేస్ అంటున్న రకుల్ ప్రీత్ మొదటి నుండి అదే మాటను రిపీట్ చేస్తోంది.