అంతా ఓపెన్‌…తిరిగి ఇచ్చేయాల్సిందే

206
Rakul opens secret on Telugu learning
- Advertisement -

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. తెలుగు సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించడమే కాకుండా అగ్ర హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేస్తున్నది. సినిమాల్లో నటిస్తునే సొంత వ్యాపారాలను విస్తరిస్తున్నది. ఊరి నుంచి చాలా తీసుకున్నారు తిరిగి ఇచ్చేయాల్సిందే అంటూ శ్రీమంతుడు సినిమాలో మహేష్ చెప్పిన డైలాగ్‌కు ఇంప్రెస్ అయిందో ఏమో గానీ ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే తనవంతుగా సామాజిక కార్యక్రలకు సైతం శ్రీకారం చుడుతోంది. రకుల్ చెప్పట్టిన సామాజిక సేవా కార్యక్రమంపై సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది.

ఈ సందర్భంగా మీడియాతో చిట్‌ చాట్‌లో మాట్లాడిన రకుల్ మిగతా హీరోయిన్స్‌తో పోలిస్తే మీరు వేగంగా భాషపై పట్టు పెంచుకొన్నారు, దాని వెనక రహస్యమేంటి? అని అడిగితే… ‘అందులో రహస్యమేమీ లేదు’ అని సింపుల్‌గా తేల్చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమ నన్ను ఓ స్థానంలో కూర్చోబెట్టింది. దానికి గౌరవంగా నేనూ ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాల్సిందే. అందుకే భాష నేర్చుకొన్నా. ఆర్నెళ్లల్లోనే నేను తెలుగుపై పట్టు పెంచుకొన్నా. ఆ ప్రయత్నం నాకే ఎక్కువగా ఉపయోగపడింది. కథ, పాత్రల్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి దోహపడిందని చెప్పింది రకుల్‌.

ప్రస్తుతం మహేష్ బాబు –మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న స్పైడర్ మూవీలో నటిస్తోన్న ఈ భామ కొరటాల శివ-మహేష్ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాలో నటించనుంది.

- Advertisement -