ప్రభాస్ పాలిట విలనయ్యడుగా..!

264
Aravind Swamy in Sahoo
- Advertisement -

బాహుబలి 2 హిట్ అందించిన జోష్‌తో మంచి ఊపు మీదున్న ప్రభాస్ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘సాహో’. సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించడానికి యూవీ క్రియేషన్స్ వారు రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. హిందీ, మ‌ల‌యాళం, తమిళ్, తెలుగు భాష‌ల‌లో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రభాస్‌కి ఉన్న  క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని తీసుకోవాలనుకుంటున్నారట.

రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల చివర్లో సెట్స్ పైకి రానుంది. ఇంకా హీరోయిన్ ఎవరనే విషయం మాత్రం ఫైనల్ కాలేదు. ఇప్పటికే రేష్మిక మందన్న, అలియా భట్, తమన్నా ల పేర్లు వినిపిస్తున్నాయి. తమన్నా ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ప్రభాస్ పాలిట విలన్ మాత్రం దొరికేశాడు. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Aravind Swamy in Sahoo
ఈ సినిమాకు విలన్‌గా స్టైలిష్ హీరో అరవింద్ స్వామిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ధృవ సినిమాల తనదైన విలనిజంతో ఆకట్టుకున్న అరవింద్ స్వామి సాహోలో కూడా అదే తరహా నటనతో ఆకట్టుకుంటానడి చిత్రయూనిట్ భావిస్తోందట.అంతేగాదు అరవింద్ స్వామి ఐతేనే ప్రభాస్‌కు సరిగ్గా సూటవుతాడని భావిస్తున్న దర్శకుడు ఆయన ఎంపికపై పట్టుబడుతున్నాడట. ఇప్పుడు ఇదే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రభాస్ విలన్‌గా అరవింద్ స్వామి ఓకే  ఐతే వీరిద్దరి  మధ్య వచ్చే సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదుగా ? అంటూ ఫ్యాన్స్ సంబురపడిపోతున్నారు. ఈ చిత్రాన్ని త్వరగా పూర్తీ చేసిన వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలనీ ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే విడుదలైన  సాహో టీజర్‌తో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాడు ప్రభాస్.

- Advertisement -