రకుల్ పాత ఫోటో వైరల్

29
- Advertisement -

రకుల్ ప్రీత్ సింగ్ అనగానే సౌత్ లో స్టార్ హీరోయిన్ అని గుర్తుకువస్తోంది. కానీ రకుల్ ఇక్కడ స్టార్ బ్యూటీగా చలామణి కాకముందు మరాఠీ చిత్ర సీమలో జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా పని చేస్తోంది అని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. సహజంగా సోషల్ మీడియాలో హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడం చాలా కామన్. స్టార్ హీరోయిన్స్ చిన్న నాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు నిత్యం నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ లాగే చాలా మంది హీరోయిన్స్ స్టార్ డమ్ రాకముందు చిన్న చిన్న పాత్రలు, షార్ట్ ఫిలిమ్స్, రీజనల్ మూవీస్ లో నటిస్తారు.

అప్పటి సావిత్రి నుంచి నేటి శివాని వరకూ ఇది చాలా సాధారణమైన విషయం. అయితే, అప్పటి ఆయా హీరోయిన్ల ఫోటోలు ఇప్పుడు కూడా వైరల్ అవుతూ ఉంటాయి.. ఈ క్రమంలోనే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు సంబంధించిన ఫోటో కూడా వైరల్ అయ్యాయి. రకుల్ పాత ఫోటోలు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నాయి. మొదట తన యాక్టింగ్‌ కెరీర్‌ను సీరియల్స్ నుంచి మొదలెట్టిన రకుల్.. ఆ తర్వాత వయా మరాఠా సినిమాల్లో యాక్ట్ చేసి బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో నటించి పేరు తెచ్చుకుంది.

అందుకు తగ్గట్టుగానే అమ్మడుకి మంచి అవకాశాలు వచ్చాయి. వచ్చిన అవకాశాలను రకుల్ కూడా అద్భుతంగా ఉపయోగించుకుంది. మొత్తంగా రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ లో ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతుంది. అలాగే కొన్ని వెబ్ సిరీస్ లు కూడా నటించాలి అని ఫిక్స్ అయ్యింది.

Also Read:దిల్ రాజు …ష‌ర‌తులు వ‌ర్తిసాయి

- Advertisement -