రకుల్ బర్త్ డే..బాలయ్య స్పెషల్ ట్రీట్

263
rakul
- Advertisement -

నటసింహం బాలకృష్ణ-దర్శకుడు క్రిష్ కాంబినేషన్‌లో లెజండరీ నటుడు నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్. రెండు పార్టులు(కథానాయకుడు,మహా నాయకుడు)అంటూ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. తెలుగు సినిమా చరిత్రలో తొలిసారి పదిరోజుల తేడాలో రెండు పార్టులు ప్రేక్షకుల ముందుకురానున్నాయి.

ఇప్పటికే సినిమాలో నటిస్తున్న వారి పాత్రల వేషధారణను వారి బర్త్ డే సందర్భంగా లేదా స్పెషల్ ట్రీట్‌గా విడుదల చేసుకుంటూ వస్తున్న చిత్ర యూనిట్ తాజాగా సొట్టబుగ్గల సుందరి రకుల్ ప్రీత్ లుక్‌ని విడుదల చేసింది. ఈ సినిమాలో రకుల్ శ్రీదేవి పాత్రలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో రకుల్ బర్త్ డే సందర్భంగా ఆమె లుక్‌ని రివీల్ చేసింది ఎన్టీఆర్ యూనిట్.

rakul preet

ఎన్టీఆర్ హిట్ సినిమాల్లో ఒకటైన వేటగాడు మూవీలోని ఆకు చాటు పిందె తడితే సాంగ్‌ని ఈ సినిమాలో రిమేక్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. సినిమాకు హైలైట్‌గా ఈ సాంగ్‌ నిలవనుందట. జనవరి 9న ఫస్ట్ పార్ట్(కథానాయకుడు),జనవరి 24న రెండో పార్ట్(మహానాయకుడు) విడుదల కానుంది.

ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యా బాల‌న్ ,ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రలో రానా , ఆయన భార్య భువనేశ్వరి పాత్రలో మలయాళనటి మంజిమా మోహన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ , హెచ్ఎమ్ రెడ్డి కోసం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి , ఎన్టీఆర్ కూతురు పురందేశ్వ‌రిగా హిమాన్సీ నటిస్తున్నారు. ఎస్వీఆర్ పాత్ర కోసం మెగా బ్రదర్ నాగబాబు నటిస్తున్నారు.

- Advertisement -