- Advertisement -
ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టగలరా? ఏం కనపడకుండా మొహమంతా గుడ్డతో కప్పేసుకున్నఈ అమ్మడు… తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనస్సు దోచుకుంది. ఈమె ఎవరో కాదు.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఒకవైపు మండే ఎండ.. మరోవైపు షూటింగ్.. మేకప్ పోతుందని కావచ్చు… ఎండకు తట్టుకోలేక ఇలా పూర్తిగా మొహాన్ని కప్పేసుకుంది.
ఈ ఫోటోను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన రకుల్.. 45 డిగ్రీల ఎండలో రేపల్లేలో షూటింగ్ చేస్తున్నట్టు చెప్పింది. అంతేకాకుండా విపరీతమైన వేడిలో మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ఇలా కప్పుకోవాలని సలహా కూడా ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ మహేష్-మురగదాస్ కాంబినేషన్‌లో తెకకెక్కుతున్న స్పైడర్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో రకుల్ ఒక మెడికోగా కనిపించనున్నట్టు సమాచారం.
- Advertisement -