మాధవికి కౌంటర్ ఇచ్చిన రకుల్‌..

216
- Advertisement -

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం ఈ మధ్య బాగా వినిపిస్తోంది. ఎప్పుడు లేనంతగా గత కొంత కాలంగా క్యాస్టింగ్ కౌచ్ అనే పదం గురించి కొంత మందికి తెలుగు హీరోయిన్స్ పెదవి విప్పడం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా శ్రీ రెడ్డి – మాధవి లత స్పందించిన విషయం తెలిసిందే.

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అన్న పదమే లేదని, అవకాశాల కోసం ఎవరూ ఏమీ త్యాగాలు చేయడం లేదని, హీరోయిన్లకు లైంగిక వేధింపులు ఎదురు అవుతున్నాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని.. తాను ఎప్పుడు కూడా టాలీవుడ్ లో అలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. అంతేకాదు ఈ వ్యాఖ్యలను మాధవీలత తీవ్రంగా ఖండించింది.

Rakul Faces Backlash From Madhavi Latha Over This

అయితే రకుల్ కి ఈ విషయం ఆలస్యంగా తెలియడంతో అమ్మడు ఒక్కసారిగా షాక్ అయ్యింది. అంతే కాకుండా ఆ విమర్శలకు ఒక్కసారిగా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. నా పేరెంట్స్ కి తెలుగు రాదు కాబట్టి సరిపోయింది. లేకుంటే వాళ్లకు ఈ విషయం అర్ధమైతే ఇలాంటి ఇండస్ట్రీలో నువ్వు వర్క్ చేస్తున్నావా అని అనేవారు. అలా ఆలోచిస్తే ఎంతో అవమానకరంగా ఉంటుందని చెప్పింది. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడకండని రకుల్ తెలిపింది.

- Advertisement -