శేఖర్‌ కమ్ముల బండారం బయటపెట్టిన శ్రీరెడ్డి..!

262
Sri Reddy Blasts Shekar Kammula
- Advertisement -

టాలీవుడ్‌లో కామవాంఛ తీర్చితే గానీ చాన్స్ ఇవ్వరంటూ ‘క్యాస్టింగ్ కౌచ్’ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చి ఇండస్ట్రీని షేక్ చేసిన నటి శ్రీరెడ్డి. ఒక్క ఛాన్స్ కోసం ఎన్ని ఇబ్బందులు పడాలో మీడియా ముందే వెల్లడించిన శ్రీరెడ్డి తాజగా తన దగ్గర ఉన్న కొంతమంది పేర్లను ఆధారాలతో సహా బయటపెడతానని తెలిపిన సంగతి తెలిసిందే.

తాజాగా ఫేస్ బుక్ వేదికగా దర్శకుడు శేఖర్ కమ్ములపై తనదైన శైలీలో సెటైర్లు విసిరింది. హ్యాపీడేస్, గోదావరి,లీడర్, ‘ఫిదా’ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల పేరును శ్రీరెడ్డి పరోక్షంగా ప్రస్తావించింది. కొమ్ములు వచ్చిన శేఖర్ అంటూ ఆ దర్శకుడెవరో చెప్పకనే చెప్పి…. శేఖర్ కమ్ముల గాలితీసేసింది.శ్రీరెడ్డి చేసిన పోస్టు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మరి దీనిపై శేఖర్ కమ్ముల ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

ఇటీవలె ప్రముఖ ఛానల్‌లో కొన్ని ప్రోగ్రాంలకు డైరెక్షన్ వహించే ఒక దర్శకుడిని టార్గెట్ చేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. ఆయన పేరును ప్రస్తావిస్తూ దారుణంగా దూషించింది. ఆయా ప్రోగ్రాంలకు వచ్చే వారిని ఆ దర్శకుడు ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ.. యాంకర్స్‌గా ట్రై చేస్తున్న అమ్మాయిల్ని దారుణంగా మోసం చేస్తారని ఆరోపించింది. ఆమె కూడా ఓ ప్రముఖ యాంకర్‌ అని చెప్పుకొచ్చింది.

sri reddy facebook

- Advertisement -