మొక్కలు నాటిన డిసిపి రక్షిత కె మూర్తి..

932
Rakshitha K Murthy IPS
- Advertisement -

రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజవంతంగా కొనసాగుతుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రోహిణి ప్రియదర్శిని డీసీపీ సైబరాబాద్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన రక్షిత కె మూర్తి డీసీపీ మల్కాజిగిరి ఈ రోజు డీసీపీ కార్యాలయంలో మొక్కలు నాటారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం మన దినచర్యలో భాగం కావాలి అని అన్నారు. కేసీఆర్ భవిష్యత్ తరాలకు మంచి ఆక్సిజన్ అందించడానికి హరితహారం చేపట్టారు, దీనికి మద్దతుగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇందులో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో భాగంగా మరో ముగ్గురికి సంప్రీత్ సింగ్ డీసీపీ ఎల్బీ నగర్, రాహుల్ ఎస్పీ సిరిసిల్ల జిల్లా, శరత్ ఏసిపి ఏటూరునాగారం లకు ఛాలెంజ్ చేశారు.

- Advertisement -