అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “రాక్షస కావ్యం”. ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మించారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఉమేష్ చిక్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీమాన్ కీర్తి రూపొందించారు. రా అండ్ రస్టిక్ మూవీగా “రాక్షస కావ్యం”కు ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది. “రాక్షస కావ్యం” మూవీ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో
హీరో అభయ్ నవీన్ మాట్లాడుతూ- నేను ఇప్పటిదాకా చేయని క్యారెక్టర్ ఈ సినిమాలో చేశాను. నేను ఈ క్యారెక్టర్ చేయగలను అని నమ్మిన నిర్మాత దాము అన్నకు, డైరెక్టర్ శ్రీమాన్ కు థ్యాంక్స్. ఇప్పటిదాకా నటుడిగా నన్ను పెళ్లి చూపులు, జార్జ్ రెడ్డి, పిట్టకథలు వంటి మూవీస్ తో ప్రేక్షకులు గుర్తు పెట్టుకున్నారు. అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్, కొత్త జానర్ లో చేయాలని అనుకునేవాడిని. అలాంటి టైమ్ లో ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ దొరికింది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తే నటుడిగా నేను అన్ని రకాల పాత్రల్లో నటించగలను అనే పేరు దక్కుతుంది. “రాక్షస కావ్యం” సినిమా కంటెంట్ ఎంత కొత్తగా ఉంటుందో మీరు టీజర్, ట్రైలర్, పాటల ద్వారా చూశారు. ఇటీవల మేము ఈ సినిమా చూడాలని కోరుకున్న వారికి ప్రీమియర్స్ వేశాం. వాళ్లంతా సినిమా తమకు బాగా నచ్చిందని అప్రిషియేట్ చేశారు. ఈ నెల 13 థియేటర్స్ లోకి వస్తున్న “రాక్షస కావ్యం” తప్పకుండా మీ అందరికీ సినిమా నచ్చుతుంది. మా సినిమాలో మీకు నచ్చిన విషయాన్ని ఇతరులకు షేర్ చేయండి. మీ వల్ల ఒక మంచి సినిమాకు పేరొస్తే హ్యాపీగా ఫీలవుతాం. అన్నారు.
డైరెక్టర్ శ్రీమాన్ కీర్తి మాట్లాడుతూ – బడ్జెట్ వైజ్ చిన్న సినిమా అయిన ఇది కంటెంట్ పరంగా పెద్ద సినిమా. పురాణాల్లోని జయవిజయుల పాత్రల్ని స్ఫూర్తిగా తీసుకుని కలియుగంలో వారు జన్మిస్తే ఎలా ఉంటుందనే ఊహతో రాసుకున్న స్క్రిప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్ లో ఎలాంటి వివాదాస్పద అంశాలు లేవు. దేవుళ్లలాగే రాక్షసులకూ కథలు ఉంటాయి. మనలోనూ దేవుడు, రాక్షసుడు ఇద్దరూ ఉంటారు. ఒక్కో సమయాన్ని బట్టి ఒక్కొక్కరు బయటకు వస్తారు. మా సినిమాలో చదువుకోవాలని, ఆల్కహాల్ వద్దనే మెసేజ్ ఉంది. అయితే అది అండర్ కరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా చేస్తున్నన్ని రోజులు ఇదొక్క ప్రాజెక్ట్ మీదే మా టీమ్ అంతా ఉన్నారు. “రాక్షస కావ్యం” చూడాలనుకునే వారి కోసం మేము ఒక పోస్ట్ పెట్టాం. ఆ పోస్ట్ కు రెస్పాండ్ అయిన ప్రేక్షకులకు ఐదు ప్రీమియర్ షోస్ వేశాం. ఇందులో మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ లేరు. బయటి వాళ్లు సినిమా చూస్తే ఎలా రియాక్ట్ అవుతారు అని తెలుసుకోవాలని అనుకున్నాం. సినిమా చూసిన వాళ్లందరి నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. రేపు 13న థియేటర్స్ లోనూ ఇదే రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం.అన్నారు.
Also Read:గోడకుర్చీ వేస్తే.. ఉపయోగాలు తెలుసా?
నిర్మాత దామురెడ్డి మాట్లాడుతూ – “రాక్షస కావ్యం” సినిమాతో మేమొక డిఫరెంట్ ప్రయోగాత్మక సినిమా చేశాం. సినిమాలో మంచి ఎమోషన్ ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. స్లమ్ లో జరిగే కథ ఇది. స్లమ్ లైఫ్ తెలంగాణలోనే కాదు ఏపీ, బీహార్, ఒరిస్సా ఎక్కడికి వెళ్లినా ఒకేలా ఉంటుంది. తెలంగాణ సినిమాల్లో ఆల్కహాల్ అలవాటును ఎక్కువగా చూపిస్తున్నారనే విమర్శకు సమాధానంలా మా సినిమా ఉంటుంది. ట్రైలర్ లో హింస, ఆల్కహాల్ అనేవి కనిపిస్తున్నా..సినిమాలో అవి వద్దనే మంచి సందేశాన్ని ఇచ్చాం. ఈ కథలో చదువు గొప్పదనం చెబుతున్నాం. స్లమ్ లో తల్లి లేని పిల్లలు ఎలా బాధలు పడతారు. అలాగే ఆల్కహాల్ వల్ల ఒక కుటుంబం ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటుంది అనే అంశాలు చూపిస్తున్నాం. సినిమాలోని ప్రతి క్యారెక్టర్ మనకు తెలిసినట్లు, మనం చూసిన క్యారెక్టర్ లా ఉంటుంది. మా సినిమాకు ఆడియెన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ కోసం వేచి చూస్తున్నాం. మా సినిమాకు సపోర్ట్ చేస్తున్న మధుర శ్రీధర్ రెడ్డి గారికి, ప్రొడక్షన్ లో పార్టనర్ అయిన శింగనమల కల్యాణ గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉమేష్ చిక్కుకు థ్యాంక్స్. “రాక్షస కావ్యం” యూనిట్ అంతా ఇది మా సినిమా అని భావించి పనిచేశారు. రెండేళ్లు ట్రావెల్ అయ్యారు. మంచి సపోర్ట్ ఇచ్చిన టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్. క్రైమ్ డ్రామా సినిమా ఇది. గతంలో వచ్చిన ఏ సినిమాను పోలి ఉండదు. థియేటర్ లో “రాక్షస కావ్యం” సినిమాను చూస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
యాక్టర్ యాదమ్మ రాజు మాట్లాడుతూ – రాక్షస కావ్యం సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించాను. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దాము గారికి, శ్రీమాన్ అన్నకు థ్యాంక్స్. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉండే దోస్త్ గా నటించాను. ఈ దోస్త్ వల్ల అన్నదమ్ముల మధ్య ఎలాంటి తేడాలు వచ్చాయి అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అన్నారు.
హీరోయిన్ కుశాలిని మాట్లాడుతూ – రాక్షస కావ్యం మూవీలో నటించే అవకాశం ఇచ్చిన దాము గారికి, శ్రీమాన్ కు థ్యాంక్స్. ఈ సినిమాలో స్లమ్ లో ఉండే అమ్మాయి క్యారెక్టర్ లో నటించాను. తనకు చదువు మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. అక్కడున్న వారిని కూడా చదువుకోమని ఎంకరేజ్ చేస్తుంటుంది. ఈ సినిమా నటిగా నాకు పేరు తెస్తుందని ఆశిస్తున్నా. అని చెప్పింది.
Also Read: