ఫ్యాన్సీ రేటుకు ”ర‌క్ష‌క‌భ‌టుడు”..

252
Rakshaka Bhatudu Hindi Rights get Fancy Price
- Advertisement -

ర‌క్ష‌, జ‌క్క‌న్న వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాలు త‌ర్వాత ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ళ ద‌ర్శ‌క‌త్వంలో సుఖీభ‌వ మూవీస్ బ్యాన‌ర్‌పై ఎ.గురురాజ్ నిర్మిస్తున్న చిత్రం `ర‌క్ష‌క‌భ‌టుడు`. మ‌రో విష‌య‌మేమంటే ఈ సినిమాలో పెద్ద స్టార్ హీరో లెవ‌రూ లేక‌పోవ‌డ‌మే..కంటెంట్‌ను హీరోగా పెట్టి ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ళ చేస్తోన్న ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. సాధార‌ణంగా దేవుడంటే దెయ్యాలు భ‌య‌ప‌డుతుంటాయి..కానీ ఓ దెయ్యాన్ని దేవుడే కాపాడ‌టం ఈ సినిమాలో డిఫ‌రెంట్ పాయింట్‌. ఈ సినిమాను అర‌కు లోయ‌ నేపథ్యంలో చిత్రీక‌రించారు. ఫ‌స్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వ‌ర‌కు ఎంట‌ర్‌టైన్మెంట్ ప్ర‌ధానంగా సాగే ఈ సినిమాలో రిచాప‌నై, బ్ర‌హ్మానందం, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, బ్ర‌హ్మాజీ, సుప్రీత్‌(కాట్రాజు) త‌దిత‌రులు న‌టించారు.

Rakshaka Bhatudu Hindi Rights get Fancy Price

థ్రిల్లింగ్ ఎంట‌ర్‌టైన్మెంట్‌తో మంచి ఎమోష‌న్స్‌ను యాడ్ చేసి ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ సినిమాను ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా మ‌లిచారు. ప్ర‌తి క్యారెక్ట‌ర్‌లో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆర్ట్ డైరెక్ట‌ర్ రాజీవ్ నాయ‌ర్ వేసిన పోలీస్ స్టేష‌న్ సెట్‌లోనే సినిమా 90 శాతం చిత్రీక‌ర‌ణ సాగింది. మ‌ల్హ‌ర్ భ‌ట్ జోషి, శేఖ‌ర్ చంద్ర మ్యూజిక్ సినిమాను హైలైట్ అంశాలుగా నిలుస్తాయి. రీసెంట్‌గా విడుద‌ల చేసిన డిజిట‌ల్ టీజ‌ర్‌కు ఆడియెన్స్ నుండి ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. అంత‌కు ముందుగా అంజ‌నేయ స్వామి పోలీస్ గెట‌ప్ వేసుకున్న డిజిట‌ల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశాం. ఆ పోస్ట‌ర్‌కు కూడా సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఆంజ‌నేయ‌స్వామి పోలీస్ గెట‌ప్ వేసుకోవ‌డ‌మేంటి అనే క్యూరియాసిటీ ప్రేక్ష‌కుల్లో, ట్రేడ్ వ‌ర్గాల్లో ఏర్ప‌డింది. హీరో ఎవ‌రో చెప్ప‌కున్నా, కాన్సెప్ట్‌పై న‌మ్మ‌కంతో సినిమా హిందీ అనువాద హ‌క్కుల‌ను ఫ్యాన్సీ ఆఫ‌ర్‌తో కోనుగోలు చేయ‌డం విశేషం. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని నిర్మాత ఎ.గురురాజ్ తెలియ‌జేశారు.

రిచాప‌నై, బ్ర‌హ్మానందం, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, బ్ర‌హ్మాజీ, సుప్రీత్‌(కాట్రాజు), అదుర్స్ ర‌ఘు, ధ‌న‌రాజ్‌, నందు, చిత్రం శ్రీను,స‌త్తెన్న‌, జ్యోతి, కృష్ణేశ్వర్‌రావు, మ‌ధు ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః మ‌ల్హ‌ర్ భ‌ట్ జోషి, ఆర్ట్ః రాజీవ్‌నాయ‌ర్‌, ఎడిటింగ్ః అమ‌ర్ రెడ్డి, ఫైట్స్ః డ్రాగ‌న్ ప్ర‌కాష్‌, ప్రొడ్యూస‌ర్ః ఎ.గురురాజ్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః వంశీకృష్ణ ఆకెళ్ల‌.

- Advertisement -