ఇద్దరు మహిళలపై అత్యాచారం కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం డేరా బాబా రామ్ రహీమ్ సింగ్ గుర్మీత్ కు కోర్టు 20 ఏళ్ల కారాగార శిక్ష విధించిన సంగతి తెలింసిందే. అయితే డేరా బాబా గుర్మీత్ రాం రహీం సింగ్, అతని దత్త పుత్రిక హనీ ప్రీత్ ఇన్సాన్ జీవిత కథ ఆధారంగా సినిమా నిర్మించేందుకు బాలీవుడ్ ఐటెం గర్ల్ రాఖీ సావంత్ నడుం బిగించింది.
తన సోదరుడు రాకేష్ సావంత్ ఈ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గుర్మీత్ రాం రహీం సింగ్ పాత్రలో సంజయ్ గోరీ పోషిస్తుండగా, హనీ ప్రీత్ ఇన్సాన్ పాత్రను రాఖీ సావంత్ పోషిస్తోంది. ఢిల్లీలో ఈ బయోపిక్ షూట్ జరుగుతున్న స్పాట్ కెళ్లిన మీడియకు రాఖీ సావంత్.. గుర్మీత్ సింగ్‌కు సంబంధించి కొన్ని ‘నగ్న’సత్యాలను విడమర్చి చెప్పింది. ”సినిమా పేరు ‘అబ్ ఇన్సాఫ్ హోగా’. మా బ్రదర్ రాకేష్ సావంత్ డైరెక్ట్ చేస్తున్నాడు. గుర్మీత్ బాబా మీద బయోపిక్ తీయడానికి నాకు సెంట్ పర్సెంట్ అర్హత ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే.. అతణ్ణి, అతడి చీకటి రాజ్యాన్ని దగ్గరినుంచి చూసిన అనుభవం నాకుంది. నాతో కూడా హనీప్రీత్ తన కూతురుగా పరిచయం చేసుకున్నాడు.. కానీ ఆ తర్వాతే తెలిసింది వాళ్ళిద్దరి అసలు ‘రంగు’. బాబాను కలుద్దాం రమ్మంటూ వాళ్ళ పీఏ నన్ను మారియట్ హోటల్‌కి పిలిపించుకున్నాడు” అంటూ ఒక్కటొక్కటిగా గుర్మీత్ రహస్యాలను విప్పి చెప్పింది రాఖీ.
సిర్సాలోని బాబా డెన్‌లోకి కూడా స్వయంగా వెళ్ళొచ్చానన్న రాఖీ సావంత్.. అక్కడ వయాగ్రా పొట్లాలు ఉండడం చూసి ఆశ్చర్యానికి గురయ్యానని తెలిపింది. ఒక సన్యాసికి, దైవాంశ సంభూతుడిగా చెప్పుకునే పెద్దమనిషికి ‘వయాగ్రా’తో పనేంటని సందేహం అప్పుడే కలిగిందని, ఏదోఒకరోజు వీడి కథ నేనే ప్రపంచానికి చెప్పేస్తానని అక్కడే నిర్ణయించుకున్నా చెప్పింది రాఖీ. వీడిచ్చే ఫారిన్ విస్కీ బాటిళ్లకు ఆశపడి సొంత ఆడబిడ్డల్ని ఇక్కడికి పంపే ‘భక్తులను’ చూసి నా మనసు చలించిందంటూ ఆవేదనతో చెప్పింది రాఖీ సావంత్.
ఈ సినిమాలో కేసు విచారణాధికారిగా తెలుగు సినిమాలతో పాటు, బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ ఎజాజ్ ఖాన్ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. డిసెంబర్ లో ఈ సినిమా విడుదల చేసేందుకు ప్రణాళిక వేసుకున్నట్టు తెలిపారు. ఈ సినిమా పేరు ‘సినిమా స్కాండల్ అబ్ ఇన్సాఫ్ హోగా’ ను నిర్ణయించినట్టు తెలిపారు.