కుల్‌దీప్‌కు హాట్రిక్‌.. ఇండియా ఘనవిజయం

231
India wins, Kuldeep Yadav becomes third Indian bowler
India wins, Kuldeep Yadav becomes third Indian bowler
- Advertisement -

కోల్‌క‌తా వ‌న్డేలో టీమిండియా బౌల‌ర్లు దుమ్ముదులిపేశారు. కుల్‌దీప్ యాద‌వ్, ఛాహల్ ధాటికి 202 పరుగులకే ఆలౌట్ అయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 252 పరుగులకు ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ 92, అజింక్యా రహానే 55 ప‌రుగులు (రనౌట్) చేసి రాణించారు. మిగతా టీమిండియా బ్యాట్స్ మెన్ లో రోహిత్ శ‌ర్మ 7 మ‌నీష్ పాండే 3, కేద‌ర్ జాద‌వ్ 24, హార్థిక్ పాండ్యా 20, భువ‌నేశ్వ‌ర్ కుమార్ 20, కుల్దీప్ యాదవ్ 0, బుమ్రా 10, చాహ‌ల్ 1 ప‌రుగు చేశారు.

253 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ చేస్తోన్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ల‌లో స్టీవెన్ స్మిత్ (59) మిన‌హా అంద‌రూ చేతులెత్తేశారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో హిల్ట‌న్ కార్ట్‌రైట్ 1, డేవిడ్ వార్న‌ర్ 1, ట్రావిస్ హెడ్ 39, మ్యాక్స్‌వెల్ 14 ఔటైన అనంత‌రం బౌలింగ్ చేసిన కుల్‌దీప్ యాద‌వ్.. మాథ్యూ వేడ్ 2, అగ‌ర్ 0, క‌మ్మిన్స్ 0 వికెట్ల‌ను వ‌రుస‌గా తీసి హ్యాట్రిక్ న‌మోదు చేసుకుని రికార్డు సృష్టించాడు. వ‌న్డేల్లో హ్యాట్రిక్ సాధించిన టీమిండియా మూడ‌వ బౌల‌ర్‌గా నిలిచాడు కుల్‌దీప్‌. గ‌తంలో ఈ ఘ‌న‌త‌ను చేత‌న్ శ‌ర్మ‌, క‌పిల్ దేవ్ మాత్ర‌మే సాధించారు. చివర్లో మార్కస్ స్టోనీస్(62 నాటౌట్‌) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. 43 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటయింది ఆస్ట్రేలియా. ఈ గెలుపుతో 2-0 అధిక్యంలో ఉంది టీమిండియా. భువనేశ్వర్ కుమార్, కుల్‌దీప్‌ యాదవ్‌లు తలో 3 వికెట్లు తీయగా, హార్థీక్ పాండ్యా, ఛాహల్‌లు తలో రెండు వికెట్లు తీశారు. కుల్‌దీప్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డ్‌ దక్కింది.

- Advertisement -