రాకేష్ తికాయత్‌పై బీజేపీ కార్యకర్తలే దాడి చేశారు..

39
Rakesh Tikait
- Advertisement -

సోమవారం భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి, రైతు నేత రాకేష్ తికాయత్‌పై ఇంకు దాడి జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకు పలు రైతు సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ఈ దాడిని దక్షిణ భారత రైతు సంఘం తీవ్రంగా ఖండించింది. తెలంగాణ రాష్ట్ర పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు కోటపాటి నరసింహ నాయుడు తికాయత్‌పై జరిగిన దాడి బీజేపీ కార్యకర్తలు చేశారని ఆరోపించారు. దాడి చేసిన బీజేపీ కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. తికాయత్‌కు పూర్తిగా మద్దతు ఉంటుంది అన్నారు నరసింహ నాయుడు.

కాగా, బెంగళూరులో సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ వద్ద జనాలు ఒకరిపై ఒకరు కుర్చీలు విరుసుకుంటూ గందరగోళం సృష్టించారు. ప్రెస్‌మీట్ జరుగుతుండగా సుమారు డజను మంది అక్కడకు చేరుకుని టికాయత్‌పై ఇంక్ చల్లారు. దీంతో అక్కడ గందరగోళం తలెత్తింది. ఈ ఘటనకు స్థానిక పోలీసులదే బాధ్యతని టికాయత్ ఆరోపించారు. పోలీసులు తమకు ఎలాంటి భద్రతా కల్పించలేదన్నారు. రైతు నిరసనలకు చిక్కులు సృష్టించాలని కర్ణాటక ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు.

- Advertisement -