అమీర్‌పేటలోని కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ రవిచంద్ర

156
- Advertisement -

తెలంగాణ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులు హైదరాబాద్‌లోని అమీర్ పేట కనకదుర్గమ్మ, శ్రీనగర్ కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయాలను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభంతో ఎదురొచ్చి ఎంపీ దంపతులకు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఎంపీ రవిచంద్ర ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

శ్రీనగర్‌కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొలువైన వినాయకుడిని దర్శించుకున్న..అనంతరం స్వామి ఆలయంకు ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్బంగా స్వామి వారి సుదర్శన యాగం ముగిసిన అనంతరం పల్లకీ సేవలో పాల్గొన్నారు. ఎంపీ రవిచంద్రకు ఆలయ అర్చకులు శాలువాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం, ప్రజలందరూ సుఖ శాంతులతో వర్థిల్లాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చాల్సిందిగా భగవంతున్ని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కనకదుర్గ ఆలయ ఈవో నరేందర్, వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఛైర్ పర్సన్ సుజాత, ఈవో మహేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -