రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

7
- Advertisement -

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదలైంది. తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు స్థానాలతో పాటు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ ఎన్నికలు మార్చి 16వ తేదీన జరగనున్నట్లు స్పష్టం చేసింది.

ఈ నెల 26వ తేదీన అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. నిర్దేశిత గడువు వరకు అభ్యర్థులు తమ నామపత్రాలు దాఖలు చేసుకోవచ్చు. అనంతరం పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలు పూర్తయిన తర్వాత అవసరమైతే పోలింగ్ నిర్వహిస్తారు.

రాజకీయ పార్టీల్లో ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై చర్చలు జోరందుకున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని రెండు స్థానాలపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ అభిషేక్‌సింగ్ మన్వీ, బీఆర్ఎస్ కేఆర్ సురేష్ రెడ్డి పదవీకాలం ముగియనుంది.

- Advertisement -