సురక్షితంగా బయట పడిన రాజు

68
- Advertisement -

వేటకు వెళ్లి బండరాళ్ల మధ్య ఇరక్కున్న రాజును క్షేమంగా బయటకు తీశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం కన్నపురం శివారు ప్రాంతంలో రాజు అనే వ్యక్తి వేటకు వెళ్లి బండరాళ్ల మధ్య ఇరుక్కున సంగతి తెలిసిందే.

కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌ కథనం ప్రకారం…మంగళవారం మధ్యాహ్నం వేటకు వెళ్లిన రాజు అనే వ్యక్తి కన్నపురం శివారు ప్రాంతంలోని బండరాళ్ల మధ్య పడిపోయిన తన ఫోన్‌ కోసం తీసుకోవాడానికి వెళ్లిన వ్యక్తి చిక్కుకుపోయారు. బండరాళ్ల మధ్య బుధవారం చిక్కుకుపోయిన సంగతి పోలీసులకు తెలపడంతో హూటాహుటిన అగ్నిమాపక రెవెన్యూ అటవీ శాఖ సిబ్బంద ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించామని తెలిపారు. సిబ్బంది 43 గంటల రెస్క్యూ ఆపరేషన్‌ తర్వాత క్షేమంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

గురువారం మధ్యాహ్నం 1.50 గంటలకు రాళ్ల మధ్య నుండి బయటకు తీశారు. అక్కడే వున్న రామారెడ్డి మండల వైద్యాధికారి పరీక్షించిన తర్వాత ప్రత్యేక అంబులెన్సు ద్వారా ఆసుపత్రికి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజు తిరిగి రాలేదు. అప్పటి నుండి బండ రాళ్ల మధ్య నరకయాతన అనుభవించాడు. రాజు ప్రాణాలతో బయట పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి…

ఏపీ బీఆర్ఎస్‌ ఇంఛార్జీగా కీలక నేత!

బి‌ఆర్‌ఎస్ తోనే మార్పు తథ్యం !

మీమ్స్‌ వైరల్‌…పవన్, లక్ష్మీ

- Advertisement -