రాజు నా బాలరాజు సాంగ్ లాంఛ్‌బై విజయ్ ఆంటోని

47
- Advertisement -

‘బిగ్‌‌బాస్’ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్ లో శ్రీ కోనేటి దర్శకత్వంలో ఎం.డీ పాషా నిర్మిస్తున్న చిత్రం బూట్‌ కట్ బాలరాజు. మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎం.డీ పాషా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ చిత్రం నుంచి రాజు నా బాలరాజు పాటని హీరో విజయ్ ఆంటోనీ లాంచ్ చేసి చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Also Read: మే26.. మేమ్‌ ఫేమస్‌ విడుదల

ధమాకా కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ పాటని తనదైన శైలిలో ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా స్వరపరిచారు. శ్యామ్ కాసర్ల అందించిన సాహిత్యం ఈ పాటకు మరింత సొగసుని తీసుకొచ్చింది. స్వాతి రెడ్డి వాయిస్ పాటకు అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ పాట లో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా వుంది. ఈ చిత్రానికి ప్రముఖ డీవోపీ శ్యామ్ కె నాయుడు కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. విజయ్ వర్ధన్ ఎడిటర్ కాగా విఠల్ కొసనం ఆర్ట్ డైరెక్టర్.

Also Read: ప్రేక్షకులకు మర్చిపోలేని ఓ అనుభూతి :గౌతమి

- Advertisement -