ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన `రాజుగారి గది` సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. తొలి భాగం ఘనవిజయం సాధించినా రెండో భాగం కాస్త నిరాశపరిచింది. అయినా ఈ సిరీస్‌లో మూడో సినిమా తీసేందుకు ఓంకార్ ఎంతో పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే రాజుగారి గది 3 చిత్రం సెట్స్ పై ఉంది. ఇందులో తమన్నా ప్రధాన పాత్రలో నటిచాల్సివుండగా తమన్నా ఇందులో నుంచి తప్పుకుంది. ఆ తర్వాత కాజల్ పేరు వినిపించినా అది కూడా సాధ్యపడలేదు. చివరకి నవతరం కథానాయిక అవికా గోర్ ఈ ప్రాజెక్టుకి కమిటైంది. ఈ చిత్రంలో అశ్విన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు.
తాజాగా రాజుగారి గది 3 ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో అవికా గోర్ లోని హారర్ యాంగిల్‌ని రివీల్ చేశారు. మాంత్రికుడి లా మెడలో పుర్రెలు వేసుకుని నుదుటిన కుంకుమ రుద్దుకుని కనిపిస్తున్న అశ్విన్‌కి రియల్ ఘోస్ట్ ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తోంది. ఓక్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఓంకార్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి దర్శకుడు ఓంకార్ ఈ చిత్రంతో ఏమేరకు ప్రక్షకులను భయపట్టిస్తాడో చూడాలి. దసరా కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.