సైరా..ప్రీ రిలీజ్ బిజినెస్ అదుర్స్‌..!

730
sye raa pre business
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ హిస్టారికల్ మూవీ `సైరా నరసింహారెడ్డి`. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌,కోలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఈ మూవీలో నటిస్తుండటంతో భారీ హైప్ క్రియేట్ అయింది. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో తన మార్క్‌ చూపించాడు చిరంజీవి.

గత రికార్డులను చెరిపేస్తూ ఉభయ గోదావరి జిల్లాలో సత్తాచాటాడు చిరు. సైరా రైట్స్‌ ఏకంగా రూ.19.6 కోట్లకు అమ్ముడుపోయినట్టు టాలీవుడ్ టాక్. ఇప్పటి వరకు ఏ సినిమా ఈ రెండు జిల్లాల్లో ఇంత పెద్ద బిజినెస్ చేయలేదు.

బాహుబలి, సాహో లాంటి సినిమాల రైట్స్‌ని కూడా బ్రేక్ చేసింది సైరా. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, జగపతిబాబు, సుదీప్ లాంటి ముఖ్యమైన నటులు కీలక పాత్రలు పోషించగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -