వసూళ్ల రా’రాజు’ గారి గది 2

228
Raju Gari Gadhi 2 box-office collections
- Advertisement -

అక్కినేని నాగార్జన, సమంత కీలక పాత్రలు పోషించిన చిత్రం రాజుగారి గది-2. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ అయినప్పటి నుంచి పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. అక్కినేని వారింట పెళ్లి తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమా ఆ ఫ్యామిలీకి డబుల్ సంతోషాన్నిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున భారీ ఓపెనింగ్స్ ను తెచ్చుకున్న ఈ సినిమా, ఆ తరువాత రెండు రోజుల్లోను అదే జోరును కొనసాగించింది. మూడు రోజుల్లో 9.52 కోట్ల షేర్ ను రాబట్టింది.  హారర్ థ్రిల్లర్ సినిమా అయినప్పటికీ .. ఇందులో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉంది. ఆ ఎమోషనల్ కంటెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రావడానికి బాగా హెల్ప్ అయింది. ఆ కంటెంట్ వాళ్లకి బాగా కనెక్ట్ కావడం కలిసొచ్చింది.  ఇక శాటిలైట్ .. హిందీ డబ్బింగ్ రైట్స్ .. డిజిటల్ రైట్స్ పరంగా ఈ సినిమా ఆల్రెడీ లాభాలు తెచ్చిపెట్టడం విశేషం.

సోగ్గాడే చిన్ని నాయన  కంటే రాజుగారి గది పెద్ద హిట్‌గా నిలిచిందన్నారు నాగార్జున. సినిమా సక్సెస్‌ మీట్‌లో మాట్లాడిన నాగ్..చాలా రోజుల తర్వాత తృప్తిగా రెండు బీర్లు తాగి చికెన్ బిర్యానీ తిని సంతోషంగా ఎంజాయ్ చేశానని చెప్పారు.   తెలుగు ప్రేక్షకులు నాకు అందించిన పెళ్లి కానుక ఈ చిత్ర విజయమని సమంత చెప్పుకొచ్చింది. మా మావయ్యగారి సినిమా పెద్ద హిట్ అవ్వాలని బలంగా కోరుకొన్నాను. నన్ను ఈ పాత్రకి సెలక్ట్ చేసుకొన్నందుకు ఓంకార్ గారికి, ఆ పాత్రను యాక్సెప్ట్ చేసే తెలివి ఇచ్చిన దేవుడికి కృతజ్నతలు. మామయ్య (నాగార్జున) క్లైమాక్స్ షూట్ లో చాలా హెల్ప్ చేశారు తెలిపింది.

- Advertisement -