ప్రచారానికి సిద్ధమౌతున్న సూపర్‌స్టార్‌..

228
- Advertisement -

రజనీకాంత్‌ సినిమా ‘రోబో’ లాంటి విజయవంతమైన సినిమాకు సీక్వెల్‌ ‘2.0’. చిట్టి రోబోగా రజనీకాంత్‌ చేసిన సందడిని మరోసారి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ సినిమా. చిత్రీకరణ పూర్తయి ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈలోగా చిత్రబృందం సినిమా ప్రచారానికి సన్నద్ధమైపోతోంది. అంతర్జాతీయ సాంకేతికత నిపుణులు పని చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రచారాన్ని భారీ స్థాయిలో నిర్వహించడానికి చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ప్రయత్నాలు చేస్తోంది.

Rajnikanth Robot 2.0 Ready to World Tour

2.0 సినిమా కోసం ప్రపంచ ప్రచార యాత్ర చేయబోతున్నారు. ప్రచార కార్యక్రమం కోసం ప్రత్యేక ఫ్లెక్సీ బ్యానర్‌ను రూపొందిస్తున్నారు. దీని కోసం 600 గంటలకు పైగా పని గంటల్ని వెచ్చించారు. 12 కి.మీల దారాన్ని వాడారు. 1371 మీటర్ల క్లాత్‌ను వినియోగించారు. దాని కోసం ఒక వీడియోను కూడా విడుదల చేస్తున్నాం అంటున్నారు మేకర్లు. రజనీకాంత్‌ సరసన అమీ జాక్సన్‌ కథా నాయికగా నటిస్తున్న ఈ చిత్రం. దీపావళికి ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను విడుదల చేస్తారు. రజనీకాంత్‌ జన్మదిన కానుకగా డిసెంబర్‌ 12న ట్రైలర్‌ను లాంచ్‌ చేస్తారు. అక్టోబరులో సినిమా పాటల విడుదల వేడుకను దుబాయిలో వినూత్నంగా నిర్వహించే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఈ సినిమాలో రజినీకాంత్ కు ప్రతినాయకుడుగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. రజినీకు జోడీగా అమీ జాక్సన్ నటిస్తుంది. ఇంకా ఈ చిత్రంలో సుధాంశు పాండే – ఆదిల్ హుసేన్ – కళాభవన్ షాజాన్ – రియాజ్ ఖాన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు.

- Advertisement -